YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు..దస్తగిరి వాంగ్మూలంపై సహచర నిందితుల అభ్యంతరం.. రిజర్వ్ లో హైకోర్టు తీర్పు

YS Viveka murder case accused raises objections on Dastagiri

  • కేసులో అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి
  • అప్రూవర్ గా మారడంపై సహచర నిందితుల అభ్యంతరం
  • అప్రూవర్ గా మారడానికి కోర్టు అనుమతించడంపై హైకోర్టును ఆశ్రయించిన వైనం

మాజీ మంత్రి, దివంగత వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఏ4 నిందితుడైన వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అప్రూవర్ గా మారడంపై సహచర నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు తొలి నుంచి అభ్యంతరం చెపుతున్నారు. దస్తగిరి ఇచ్చిన 164 వాంగ్మూలంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆయన అప్రూవర్ గా మారడానికి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

  • Loading...

More Telugu News