AP Govt: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... తాజా మార్గదర్శకాలు ఇవిగో!
- ఏపీలో కరోనా ఉద్ధృతి
- భారీగా పెరిగిన రోజువారీ కేసులు
- ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూ
- రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
రాష్ట్రంలోనూ కరోనా రక్కసి కోరలు చాస్తుండడంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుండగా, నేడు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో నిన్న 4 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేడు 7 వేలకు చేరువలో కొత్త కేసులు వెల్లడయ్యాయి.
- రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ
- రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
- వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), టెలికాం సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది, పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.
- చికిత్స పొందుతున్న రోగులు, గర్భవతులకు మినహాయింపు
- విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వారికి మినహాయింపు
- షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా.
- నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి అనుమతి
- ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతి
- సరకు రవాణా వాహనాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.