Keerthy Suresh: 'నెగెటివ్' అనేది ఇప్పుడు 'పాజిటివ్' అంశంగా మారింది: కీర్తి సురేశ్

Keerthi Suresh recovers from Corona

  • ఈ నెల 11న కరోనా బారిన పడిన కీర్తి సురేశ్
  • కరోనా నుంచి కోలుకున్న కీర్తి
  • తనకు నెగెటివ్ వచ్చిందని ట్వీట్ చేసిన కీర్తి సురేశ్

సినీ నటి కీర్తి సురేశ్ కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాజాగా నిర్వహించిన కోవిడ్ టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని ఆమె తెలిపింది. ఈరోజుల్లో 'నెగెటివ్' అనేది 'పాజిటివ్' అంశంగా మారిందని చెప్పింది. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని తెలిపింది.
 
తనకు కరోనా సోకిందని ఈ నెల 11న కీర్తి సురేశ్ ప్రకటించింది. తనకు కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పింది. త్వరలోనే కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తానని అప్పుడు తెలిపింది.

Keerthy Suresh
Corona Virus
Tollywood
  • Loading...

More Telugu News