India: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 9 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు!

India registers 238018 corona cases in last 24 hours

  • గత 24 గంటల్లో 2,38,018 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,57,421
  • దేశ వ్యాప్తంగా 310 మంది మృతి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పోలిస్తే ఈరోజు నమోదైన కేసులు తక్కువగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,38,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసుల కంటే ఈ సంఖ్య 20,071 తక్కువ కావడం గమనార్హం.

ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 1,57,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 310 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 8,891 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 8.31 శాతం ఎక్కువ. ప్రస్తుతం రికవరీ రేటు 94.09 శాతం కాగా... మరణాల రేటు 1.29 శాతంగా ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News