Chintamani: ఏపీలో 'చింతామణి' నాటక ప్రదర్శనపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఆదేశాలు జారీ

Andhra Pradesh government bans Chintamani drama

  • చింతామణి నాటకాన్ని నిషేధించాలని కోరిన ఆర్యవైశ్యులు
  • తమను కించపరిచేలా నాటకం ఉందని ప్రభుత్వానికి తెలిపిన వైనం
  • ఆర్యవైశ్యుల కోరిక మేరకు నాటకాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం

ఇరు తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రచించిన ఈ నాటకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం. ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకం తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈ చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా వ్యసనాల వైపు మళ్లించేలా నాటకం ఉందని, దీన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ నాటకం తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు.

వారి డిమాండ్ మేరకు చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నాటకాన్ని నిషేధించడంపై ఆర్యవైశ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా... నాటక ప్రియులు పెదవి విరుస్తున్నారు.

  • Loading...

More Telugu News