Nara Lokesh: నాకు కరోనా పాజిటివ్ వచ్చింది: నారా లోకేశ్

Nara Lokesh tested corona positive

  • ట్వీట్ చేసిన లోకేశ్
  • ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడి
  • ఐసోలేషన్ లో ఉంటానని వివరణ
  • తనను కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందని లోకేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. అయితే కరోనా నుంచి కోలుకునేంత వరకు ఐసోలేషన్ లో ఉంటానని తెలిపారు. ఇటీవల కొన్నిరోజులుగా తనను కలిసిన వారు త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని అర్థిస్తున్నట్టు తెలిపారు.

Nara Lokesh
Corona Virus
Positive
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News