traffic: హైద‌రాబాద్‌కు సాధార‌ణ రోజుల్లో కంటే భారీగా పెరిగిన వాహ‌నాల రాక‌పోక‌లు

traffic jam at highway

  • సంక్రాంతి పండగకు సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు
  • వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వ‌స్తోన్న జ‌నాలు
  • పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల‌ వద్ద ర‌ద్దీ

సంక్రాంతి పండగకు ముందు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే ప్ర‌జ‌ల‌తో రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండులు కిక్కిరిసిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చే ప్ర‌యాణికుల‌తో మ‌ళ్లీ రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌లో ర‌ద్దీ నెల‌కొంది. ప్రజలు హైద‌రాబాద్‌కు తిరుగు పయనమవడంతో నేడు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద మీదుగా నిన్న‌ 35 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్టు తెలిసింది. అలాగే, ఆ టోల్‌గేట్ మీదుగా ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సుమారు 4 లక్షలకు పైగా వాహనాల రాకపోకలు సాగించినట్లు సమాచారం. రద్దీ పెరిగిన నేప‌థ్యంలో పంతంగి టోల్ ప్లాజాతో పాటు నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధార‌ణ రోజుల్లో కంటే వాహ‌నాల రాక‌పోక‌లు భారీగా పెరిగాయి.

traffic
Hyderabad
Sankranti
  • Loading...

More Telugu News