Vijayasai Reddy: ఢిల్లీలో కూర్చొని 'నన్ను చంపేస్తారు' అని ఏడుపు మొదలెట్టాడు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams raghurama

  • రఘురామకృష్ణరాజుపై విమ‌ర్శ‌లు
  • నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే పబ్లిసిటీ స్టంట్
  • చీప్ పబ్లిసిటీ వ‌స్తుందంటే ఏమైనా చేస్తాడు
  • చివరకు గోదాట్లోకైనా ఎవరో తోసేశారనే రకం అన్న‌ విజ‌య‌సాయిరెడ్డి

తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ అసంతృప్త‌ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై త్వ‌ర‌లోనే అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ఆయ‌న అన్నారు. దీనిపై స్పందిస్తూ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

''గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని 'నన్ను చంపేస్తారు' అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం'' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
YSRCP
Raghu Rama Krishna Raju
  • Loading...

More Telugu News