pandemic: ప్రేక్ష‌కుల‌కు మ‌రో నిరాశ‌.. చిరంజీవి ఆచార్య సినిమా విడుద‌ల వాయిదా!

The release of Acharya stands postponed due to the pandemic

  • అధికారికంగా ప్ర‌క‌టించిన సినిమా టీమ్
  • క‌రోనా కార‌ణంగా వాయిదా
  • కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని ట్వీట్

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి ప‌లు పెద్ద సినిమాల విడుద‌ల వాయిదా ప‌డ‌డంతో సినీ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు వాయిదా ప‌డ్డ సినిమాల జాబితాలో చిరంజీవి 'ఆచార్య' సినిమా కూడా చేరింది. ఆచార్య సినిమాను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో ఆ టీమ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే, ఈ రోజు ఆచార్య సినిమా బృందం త‌మ అధికారిక ఖాతా ద్వారా స్పందిస్తూ.. 'మ‌హమ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఆచార్య సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం' అని తెలిపింది. కాగా, ప్ర‌స్తుతం పెద్ద హీరోల‌ సినిమాలు బంగార్రాజు, పుష్ప, అఖండ థియేట‌ర్ల‌లో ఆడుతున్నాయి. ప‌లు చిన్న సినిమాలూ సంక్రాంతికి సంద‌డి చేస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News