West Godavari District: తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 10మందికి గాయాలు

four died in road accident in Tadepalligudem

  • చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
  • డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్న పోలీసులు 
  • రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా లారీలోని చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

West Godavari District
Tadepalligudem
Lorry
Road Accident
  • Loading...

More Telugu News