Vaishnav Tej: బుల్లితెరపై 'కొండపొలం' జోరు!

Konda Polam movie update

  • క్రిష్ దర్శకత్వంలో 'కొండ పొలం'
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • థియేటర్ల నుంచి ఫ్లాప్ టాక్ 
  • బుల్లితెర నుంచి మంచి టీఆర్పీ  

క్రిష్ దర్శకత్వంలో ఆ మధ్య 'కొండ పొలం' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్ తేజ్ .. రకుల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అడవి నేపథ్యంతో రాసిన 'కొండ పొలం' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది.

కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగు ఆగిపోయింది. తిరిగి ఆ సినిమా షూటింగు ఎప్పుడు మొదలవుతుందనేది తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఆ గ్యాప్ లో ఈ కథను తీసుకుని క్రిష్ ఫారెస్టుకు వెళ్లాడు. కోట .. సాయిచంద్ .. నాజర్ వంటి పరిమితమైన పాత్రలతో పట్టుగా ఈ కథను తెరకెక్కించాడు.

ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఇటీవల 'స్టార్ మా'లో ఫస్టు టైమ్ ప్రసారం కాగా అర్బన్ లో 12.34 టీఆర్పీ వచ్చింది. థియేటర్లలో హిట్ కొట్టిన 'జాతిరత్నాలు'కి ఫస్టు టైమ్ టెలీకాస్ట్ లో ఇంతకంటే తక్కువ టీఆర్పీ రావడం గమనించవలసిన విషయం.

Vaishnav Tej
Rakul Preet Singh
Krish
Konda Polam Movie
  • Loading...

More Telugu News