KTR: రేవంత్ తో డిబేట్ కు రావాలన్న నెటిజన్... క్రిమినల్స్ తో చర్చకు రానన్న కేటీఆర్

KTR Live Chit Chat in Twitter

  • ట్విట్టర్ లో ముచ్చటించిన కేటీఆర్
  • 420లతో తాను చర్చకు రానన్న కేటీఆర్
  • సూర్య అద్భుతమైన నటుడు అని కితాబు
  • యూపీలో ఎస్పీ గాలి వీస్తోందని వెల్లడి

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానమిచ్చారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చా కార్యక్రమంలో పాల్గొనాలని ఓ వ్యక్తి కోరగా, 'నేను 420లతో డిబేట్ లో పాల్గొనను' అని కరాఖండీగా చెప్పేశారు. అంతకుముదు మరో నెటిజన్ ఇదే ప్రశ్న అడగ్గా, క్రిమినల్స్ తో తాను చర్చించబోనని స్పష్టం చేశారు.

ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో పలు రోడ్ల మూసివేతపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఈ అంశంపై పార్లమెంటులో పోరాటం చేస్తామని వెల్లడించారు. పాతబస్తీ అభివృద్ధిని, హెరిటేజ్ సైట్లను ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని మరో నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించాడు. అందుకాయన బదులిస్తూ, "నీకెవరో తప్పుడు సమాచారం అందించారు మిత్రమా! ఓసారి ఇటీవల జరిగిన అభివృద్ధిని గమనించు" అని సూచించారు.

హీరో సూర్యపై ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ, "అద్భుతమై నటుడు' అని కితాబునిచ్చారు. ఇక, ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

KTR
Revanth Reddy
Criminal
Chit Chat
Twitter
TRS
Telangana
  • Loading...

More Telugu News