Team India: మరో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా... కొనసాగుతున్న పంత్ పోరాటం

Team India loses another two wickets

  • కేప్ టౌన్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • కోహ్లీ, అశ్విన్ లను అవుట్ చేసిన ఎంగిడి
  • 6 వికెట్లకు 165 పరుగులు చేసిన టీమిండియా
  • 178 పరుగులకు చేరిన ఆధిక్యం
  • క్రీజులో పంత్, ఠాకూర్

కేప్ టౌన్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో మరో రెండు వికెట్లు కోల్పోయింది. 29 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిన లుంగి ఎంగిడి అదే ఊపులో అశ్విన్ (7) ను కూడా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 6 వికెట్లకు 165 పరుగులు. టీమిండియా ఆధిక్యం 178 పరుగులకు చేరింది. క్రీజులో రిషబ్ పంత్ (77 బ్యాటింగ్)కు తోడు శార్దూల్ ఠాకూర్ (0 బ్యాటింగ్) ఉన్నాడు.

ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 223 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 210 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు స్వల్ప ఆధిక్యం లభించింది.

Team India
Wickets
Second Innings
Cape Town
South Africa
  • Loading...

More Telugu News