Pushpa: నేపాల్ లో సైతం తగ్గేదేలేదంటున్న 'పుష్ప'.. కిక్కిరిసిపోతున్న థియేటర్లు.. వీడియోలు చూడండి!

Pushpa movie successfully playing in Nepal
  • దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ 'పుష్ప'
  • నేపాల్ లో సైతం సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనం
  • అన్ని థియేటర్ల వద్ద కనిపిస్తున్న హౌస్ ఫుల్ బోర్డులు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో సైతం హిందీ చిత్రాలతో పోటీ పడి భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు వస్తుండటంతో ఇంకా హిందీ వర్షన్ ను ఓటీటీలో విడుదల చేయలేదు. మరోవైపు నేపాల్ లో సైతం 'పుష్ప' సినిమా దుమ్ము రేపుతోంది. నేపాల్ లో హిందీ వర్షన్ సినిమా విడుదలైంది. అక్కడ విడుదలైన అన్ని థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల వద్ద జనం కిక్కిరిసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pushpa
Tollywood
Bollywood
Nepal

More Telugu News