Kerala: ఆ ఊర్లో ఇక శానిటరీ ప్యాడ్లుండవ్.. దేశంలోనే తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా ‘కుంబలంగి’

Kumbalangi In Kerala Will Be The Sanitary Napkins Free Village First In The Country

  • మెన్ స్ట్రువల్ కప్పులను పంపిణీ చేయనున్న సర్కార్
  • ‘అవల్కాయ్’ పథకంలో భాగంగా పంపిణీ
  • 18 ఏళ్లు దాటిన వారికి ఇవాళ 5 వేల కప్పులు ఇవ్వనున్న కేరళ సర్కార్

నెలసరి సమయాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్స్ వాడడం సహజం. అయితే కేరళలోని ఓ గ్రామం దేశంలోనే ‘తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామం’గా రికార్డులకెక్కనుంది. ఎర్నాకుళంలోని కుంబలంగిలో ప్యాడ్స్ కు బదులు 'మెన్ స్ట్రువల్ కప్స్'ను అందించనున్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఇవాళ 5 వేల మెన్ స్ట్రువల్ కప్పులను పంపిణీ చేయనున్నారు.

‘అవల్కాయ్ (ఆమె కోసం)’ అనే పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని ఎంపీ హీబి ఈడెన్ చెప్పారు. థింగాల్ స్కీమ్ కింద హెచ్ఎల్ఎల్ మేనేజ్ మెంట్ అకాడమీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నాయన్నారు.

కప్పుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుంబలంగిని మోడల్ విలేజ్ గా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద ఈ మోడల్ గ్రామ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News