Mohan Babu: నా కల నెరవేరింది: మోహన్ బాబు

Mohan babu started Mohan Babu University
  • తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీని ప్రారంభిస్తున్నాం
  • శ్రీ విద్యానికేతన్ లో వేసిన విత్తనాలు కల్పవృక్షంగా మారాయి
  • మీ అందరి ప్రేమే నా బలం
యూనివర్శిటీని స్థాపించాలన్న తన సుదీర్ఘ కల నెరవేరిందని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, తన అభిమానుల ప్రేమాభిమానాలతో 'మోహన్ బాబు యూనివర్శిటీ'ని ప్రారంభిస్తున్నానని సవినయంగా ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. శ్రీ విద్యానికేతన్ లో తాము వేసిన విత్తనాలు కల్పవృక్షంగా మారాయని తెలిపారు.

30 ఏళ్ల మీ నమ్మకం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్నమైన అభ్యాస విశ్వంలోకి చేరుకుందని చెప్పారు. ఎంతో కృతజ్ఞతతో మీ అందరికీ తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీని అందిస్తున్నానని తెలిపారు. మీ అందరి ప్రేమే తన బలమని... తన ఈ కలకు కూడా మీరందరూ మద్దతుగా ఉంటారని విశ్వసిస్తున్నానని చెప్పారు.


Mohan Babu
Tollywood
Mohan Babu University

More Telugu News