Balakrishna: మమ్మల్ని క్షమించండి: బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బోయపాటి సారీ

Boyapati Sreenu says sorry to Balakrishna fans

  • 'అఖండ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
  • కరోనా నేపథ్యంలో అభిమానులను పిలవని యూనిట్
  • ఫ్యాన్స్ బాగుండాలనే పిలవలేదన్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీను సారీ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బోయపాటి, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, అభిమానులను ఈ ఈవెంట్ కు పిలవలేకపోయినందుకు క్షమించాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయిందని... సక్సెస్ మీట్ కు రమ్మంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారని, వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈవెంట్ కు పిలవలేదని చెప్పారు. ఫ్యాన్స్ బాగుండాలనే వారిని పిలవలేదని అన్నారు. ఈవెంట్ కు పిలవనందుకు తమను క్షమించాలని కోరారు.

Balakrishna
Boyapati Sreenu
Akhanda
Success Meet
Sorry
  • Loading...

More Telugu News