Nagarjuna: 'బంగార్రాజు' విషయంలో క్లారిటీ ఇచ్చిన చైతూ!

Bangarraju Movie Update

  • గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు'
  • ఊహాగానాలపై స్పందించిన చైతూ 
  • రెండు పాత్రలు సమానంగా ఉంటాయని వెల్లడి 
  • ఈ నెల 14వ తేదీన విడుదల

నాగార్జున కథానాయకుడిగా గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు' సినిమా రూపొందింది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. నాగ్ సరసన రమ్యకృష్ణ .. చైతూ జోడీగా కృతిశెట్టి అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో చైతూ గెస్టు పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత వచ్చిన అప్ డేట్స్ ను చూసి, నాగార్జుననే గెస్టు రోల్ చేస్తున్నారని అనుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో చైతూకి ఇదే ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన స్పందిస్తూ, ''ఈ సినిమాలో నాన్నగారి పాత్ర .. నా పాత్ర సమానంగా ఉంటాయి. కథకి ఎంతవరకూ అవసరమో అంతవరకూ మా పాత్రలు నడుస్తాయి. సినిమా చూసిన తరువాత ఎవరిదీ గెస్టు పాత్ర కాదనే విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది. నాన్నగారి పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో .. నా పాత్రకి అంతే ప్రాముఖ్యత ఉంటుంది.

ఇక ఇతర పాత్రలు కూడా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. 'సోగ్గాడే చిన్ని నాయనా' హిట్ కారణంగా సహజంగానే ఈ సినిమాపై మరింతగా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

Nagarjuna
Ramayakrishna
Nagachaitanya
Krithi Shetty
Bangarraju Movie
  • Loading...

More Telugu News