Mahesh Babu: 'సర్కారువారి పాట' థియేటర్లకు వచ్చేది అప్పుడేనట!

Sarkaruvaari Paata movie update

  • పరశురామ్ నుంచి 'సర్కారువారి పాట'
  • ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్న మహేశ్ 
  • వైజాగ్ లో జరుగుతున్న షూటింగ్ 
  • ఏప్రిల్ నుంచి ఆగస్టుకు రిలీజ్ వాయిదా!

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ - 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న  ఈ  సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మోకాలు సర్జరీ చేయించుకున్న మహేశ్ కొన్ని రోజులుగా రెస్టు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన కాంబినేషన్లో లేని సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు కూడా పండుగ తరువాత ఈ సినిమా షూటింగులో జాయిన్ కావలసి ఉంది. కానీ ఆయనకి కరోనా రావడం .. రీసెంట్ గా రమేశ్ బాబు చనిపోవడం కారణంగా ప్లానింగ్ మారిపోయింది. కరోనా తీవ్రతను బట్టి మహేశ్ కి సంబంధించిన షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు.

 ముందుగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలనుకుని, ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు షూటింగులో జరుగుతున్న జాప్యం కారణంగా ఆగస్టులో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కరోనా కారణంగా ఎక్కడ తేడా కొట్టేసినా దసరా సినిమాల జాబితాలోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు. 

Mahesh Babu
Keerthi Suresh
parashuram
Sarlkaruvari Pata Movie
  • Loading...

More Telugu News