Raghu Rama Krishna Raju: హైదరాబాదులోని ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు

ap cid reaches raghuramas home

  • రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు వ‌చ్చిన పోలీసులు  
  • రేపు ర‌ఘురామ‌ విచారణకు రావాలని నోటీసులు
  • నోటీసులు త‌న‌కు ఇచ్చి వెళ్లాల‌న్న ర‌ఘురామ కుమారుడు
  • అందుకు ఒప్పుకోని ఏపీ సీఐడీ పోలీసులు

హైద‌రాబాద్‌, గచ్చిబౌలిలోని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ‌రాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు వ‌చ్చామ‌ని వారు తెలిపారు. రేపు ర‌ఘురామ‌ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఆ నోటీసులు త‌న‌కు ఇచ్చి వెళ్లాల‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కుమారుడు సీఐడీ అధికారుల‌ను కోరారు. అందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఒప్పుకోలేదు. ఆ నోటీసుల‌ను ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకే ఇస్తామ‌ని చెప్పారు. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

మరోపక్క, రేపు న‌ర‌సాపురానికి వ‌స్తాన‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. రెండు రోజుల పాటు న‌ర‌సాపురంలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంటికి వ‌చ్చిన ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని గ‌తంలో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపైనే విచార‌ణ జ‌రుగుతోంది.

  • Loading...

More Telugu News