Radha: బుల్లితెరపై సందడి చేస్తున్న సీనియర్ నటి రాధ

Senior actress Radha as judge in Super Queen show
  • దక్షిణాది భాషల్లో అలరించిన రాధ
  • పెళ్లి తర్వాత ముంబయిలో నివాసం
  • అడపాదడపా ఈవెంట్లలో దర్శనం
  • త్వరలో జీ తమిళ్ లో సూపర్ క్వీన్ రియాల్టీ షో
  • న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రాధ
దక్షిణాది భాషల్లో 80వ దశకంలో ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసిన హీరోయిన్లలో రాధ ముందువరుసలో ఉంటుంది. చూడచక్కని రూపం, అభినయం, డ్యాన్స్ టాలెంట్ అన్నీ కలగలిస్తే రాధ అవుతుంది. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలైంది. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది.

తాజాగా ఓ టీవీ చానల్లో జడ్జిగా సందడి చేస్తోంది. 'జీ తమిళ్' చానల్లో ఈ నెల 16న ప్రారంభం కానున్న 'సూపర్ క్వీన్' కార్యక్రమానికి రాధ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.

చాలాకాలం తర్వాత ఓ రియాల్టీ షో ద్వారా మళ్లీ వస్తున్నానని రాధ ట్వీట్ చేసింది. తన సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరిస్తున్నాడని, ఈ కార్యక్రమం 'జీ తమిళ్' లో ప్రసారం అవుతుండడం సంతోషదాయకం అని పేర్కొంది. ఈ షోలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని ఈ అందాలనటి పేర్కొంది. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమంలో వీక్షించడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. అంతేకాదు, 'సూపర్ క్వీన్' ప్రోమో కూడా పంచుకున్నారు.
Radha
Super Queen
Judge
Zee Tamil

More Telugu News