Washington Sundar: టీమిండియాలో కరోనా కలకలం... వాషింగ్టన్ సుందర్ కు పాజిటివ్

Washington Sundar tested corona positive

  • ఈ నెల 19 నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్
  • వన్డే జట్టుకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్
  • రేపు దక్షిణాఫ్రికా పయనం కానున్న జట్టు
  • ముందస్తు కరోనా టెస్టుల్లో సుందర్ కు పాజిటివ్

టీమిండియా వన్డే ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కరోనా బారినపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా వన్డే ఆటగాళ్లు రేపు భారత్ నుంచి బయల్దేరాల్సి ఉంది. ముందస్తుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో సుందర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో అతడు కేప్ టౌన్ విమానం ఎక్కడంపై అనిశ్చితి నెలకొంది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే ఈ నెల 19న జరగనుంది. అయితే సుందర్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేస్తారా? లేక, కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతడినే పంపిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Washington Sundar
Corona Virus
Positive
ODI
Team India
South Africa
  • Loading...

More Telugu News