సిద్ధార్థ్ కు ఇది కొత్తేమీ కాదు... పదేపదే మహిళలపై అనైతిక వ్యాఖ్యలు చేస్తున్నాడు: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్
- సైనా నెహ్వాల్ పై వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్
- జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
- ఓ మహిళా యాంకర్ పైనా ఇలాగే వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ
- చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ
ఇటీవల సిద్ధార్థ్ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ చానల్ యాంకర్ పైనా ఇలాగే వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు. మహిళా యాంకర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అనైతిక వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఈ అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించిందని, సిద్ధార్థ్ పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ రాసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా అతడిని నిరోధించాలని కోరినట్టు రేఖా శర్మ తెలిపారు.