Titan: కళ్లద్దాల్లోనే స్పీకర్లు.. టచ్ కంట్రోల్స్.. టైటాన్ 'స్మార్ట్ గ్లాసెస్' విడుదల!

Titans first smart glasses are here

  • సంగీతాన్ని వినొచ్చు
  • కాల్స్ స్వీకరించొచ్చు
  • ఫిట్ నెస్ ట్రాకర్ సదుపాయం
  • ధర రూ.9,999

టాటా గ్రూపు కంపెనీ అయిన టైటాన్ ఐప్లస్ తొలిసారిగా స్మార్ట్ కళ్లద్దాలను విడుదల చేసింది. దీని పేరు టైటాన్ ఐఎక్స్. కళ్లజోడు స్పీకర్లను అమర్చడం విశేషం. సన్ గ్లాసెస్, స్పెక్టకిల్స్, కంప్యూటర్ గ్లాస్.. ఇలా మూడు విధాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చని టైటాన్ ఐప్లస్ తెలిపింది. టైటాన్ ఐఎక్స్ ధర రూ.9,999. అన్ని టైటాన్ స్టోర్లలోను ఇది లభిస్తుంది. మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఒక్కటే ఉంది.
 
ప్రత్యేకతలు
ఈ కళ్లజోడుకు ఓపెన్ స్పీకర్లు ఉంటాయి. కనుక చక్కని సంగీతాన్ని స్టీరియో మోడ్ లో ఆస్వాదించొచ్చు. బ్యాటరీ ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఆడియో వినొచ్చు. క్వాల్ కామ్ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక యాప్ ఉంటుంది. ఈ ఫోన్లో క్లియర్ వాయిస్ క్యాప్చర్ (సీవీసీ) టెక్నాలజీని తీసుకొచ్చారు. దీంతో స్వర నాణ్యత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఇందులో ఫిట్ నెస్ ట్రాకర్ కూడా ఉంది. పెడోమీటర్ ను ఏర్పాటు చేశారు. రోజూ ఎన్ని అడుగులు నడిచిందీ, తద్వారా ఎన్ని కేలరీలు ఖర్చయిందీ ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. కళ్లజోడుకు ఉన్న టచ్ కంట్రోల్ తో కాల్స్ మాట్లాడుకోవచ్చు. సెల్ఫీ కూడా తీసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఒకవేళ కళ్లజోడు ఎక్కడో పెట్టి మర్చిపోతే వెతుక్కునే ఫీచర్ కూడా ఇందులో ఉంది.

  • Loading...

More Telugu News