Junior NTR: ఎన్టీఆర్ కి బాబాయ్ పాత్రలో రాజశేఖర్?

Rajasekhar in Koratala Movie

  • కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
  • కథానాయికగా కియారా అద్వాని 
  • రాజశేఖర్ తో సంప్రదింపులు  

టాలీవుడ్ లో హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, ఆ తరువాత విలన్ పాత్రల దిశగా టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన విలన్ గా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇక శ్రీకాంత్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. పవర్ఫుల్ కేరక్టర్స్ .. విలన్ రోల్స్ చేయడానికి తాను రెడీ అని రాజశేఖర్ చెప్పి కూడా చాలా కాలమే అయింది.

ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి ఆయన కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కి బాబాయ్ గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి ఆయన అయితే కరెక్టుగా నప్పుతారనే ఉద్దేశంతో కొరటాల ఆయనను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. దాదాపు రాజశేఖర్ ఒప్పుకోవచ్చునని అంటున్నారు.

'ఆచార్య' సినిమాను విడుదలకు రెడీ చేసిన కొరటాల, ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్  చేయనున్నట్టు ఇంతకుముందే ప్రకటించారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కియారా అద్వాని కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో రాజశేఖర్ నటిస్తే కనుక క్రేజీ ప్రాజక్టు అవుతుందనే చెప్పచ్చు. 

Junior NTR
Kiara Adwani
Koratala Movie
Rajasekhar
  • Loading...

More Telugu News