Galla Ashok: ఆసక్తిని రేపుతున్న 'హీరో' ట్రైలర్!

Hero movie trailer released

  • 'హీరో'గా వచ్చేస్తున్న గల్లా అశోక్ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ఈ నెల 15వ తేదీన విడుదల

అశోక్ గల్లా 'హీరో' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రాజమౌళి చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్టుగా కనిపిస్తోంది.

జగపతిబాబు .. సీనియర్ నరేశ్ .. కోట శ్రీనివాసరావు .. అజయ్ .. వెన్నెల కిశోర్ .. సత్య .. బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. మహేశ్ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక గల్లా అశోక్ ఫస్టు మూవీతో ఎంతవరకు మెప్పిస్తాడు? ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడు? అనేదే చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News