south africa: 'పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్'కు దక్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌!

south africa reject permission

  • త్వ‌ర‌లో ప‌లు మ్యాచులు ఉన్నాయి
  • న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంది
  • అందుకే అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
  • స్ప‌ష్టం చేసిన‌ సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు అనుమతి ఇవ్వ‌బోమ‌ని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు స్ప‌ష్టం చేసింది. స‌మీప భ‌విష్య‌త్తులో ఉన్న‌ అంతర్జాతీయ పర్యటనలతో పాటు దేశీయ మ్యాచ్‌ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు పాక్‌ సూపర్‌ లీగ్‌లో పాల్గొనబోర‌ని ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ చెప్పారు.

క్రికెట‌ర్లు ఎల్ల‌ప్పుడూ సొంత‌ జట్టు సేవల‌కే ప్రాధాన్యం ఇవ్వాలని స్మిత్ చెప్పారు.  వ‌చ్చే నెల‌లో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అంతేగాక‌, స్వదేశంలో బంగ్లాదేశ్‌తో కూడా ఆడాల్సి ఉంది. ఇక‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్ ఈ నెల‌ 24 నుంచే ప్రారంభం కానుంది. ఇందుకోసం పాక్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

  • Loading...

More Telugu News