Ang San Sukyi: అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. కారణం ఇదే!

Ang San Sukyi gets 4 four years jail sentence

  • మయన్మార్ లో కొనసాగుతున్న సైనిక పాలన
  • వాకీటాకీని అక్రమపద్ధతిలో దిగుమతి చేసుకున్నారంటూ సూకీపై కేసు
  • కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ మరో కేసు

మయన్మార్ లోని సైనిక ప్రభుత్వ కోర్టు అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. కొన్నాళ్ల క్రితం ఆమెను అక్కడి సైన్యాధ్యక్షుడు పదవి నుంచి తొలగించి సైనిక పాలనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె గృహనిర్బంధంలో ఉన్నారు.

తాజాగా ఆమెపై ఉన్న కేసులను విచారించిన కోర్టు ఈ జైలు శిక్షను విధించింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకున్నారనే కేసు, కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కేసులు ఆమెపై మోపడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనే ఆమెకు ఇప్పుడు శిక్ష విధించారు.

మరోవైపు సూకీని అధికారం నుంచి తప్పించి, నిర్బంధించిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 ఏళ్ల సూకీకి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలను సైనిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 1,400కు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News