Sajjala Ramakrishna Reddy: పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నాం: సజ్జల

Sajjala opines on PRC matter

  • కాసేపట్లో పీఆర్సీ ప్రకటన
  • ఉద్యోగ సంఘాలను క్యాంపు కార్యాలయానికి పిలిపించిన సర్కారు
  • సామరస్య ధోరణిలో నిర్ణయం ఉంటుందన్న సజ్జల
  • ఆర్థిక ఇబ్బందులను సీఎం నిన్ననే వివరించారని వెల్లడి

ఏపీ ప్రభుత్వం మరికాసేపట్లో పీఆర్సీపై ప్రకటన చేయనుంది. ఉద్యోగ సంఘాలను సీఎం జగన్ తో భేటీకి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను సీఎం నిన్న ఉద్యోగ సంఘాలకు వివరించారని పేర్కొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని, అన్ని వర్గాలను కలుపుకుని పోయేలా నిర్ణయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో పీఆర్సీపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేస్తారని సజ్జల తెలిపారు.

Sajjala Ramakrishna Reddy
PRC
Announcement
Employees
Andhra Pradesh
  • Loading...

More Telugu News