Prakash Raj: నట రాక్షసుడితో క్లైమాక్స్ తీస్తున్నాను: కృష్ణవంశీ

Rangamarthanda Movie Update

  • కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ'
  • మరాఠీ సినిమాకి ఇది రీమేక్
  • గ్యాప్ తరువాత సెట్స్ పైకి
  • క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ

తెలుగు తెరపై తనదైన స్టయిల్లో విభిన్నమైన కథలను పరిగెత్తించిన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. 'నిన్నే పెళ్లాడుతా' .. 'ఖడ్గం' .. 'సిందూరం' .. 'మహాత్మ' .. 'చందమామ' వంటి సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. ఆయనను క్రియేటివ్ దర్శకుడని ఎందుకంటారో ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది.

అలాంటి కృష్ణవంశీకి కొంతకాలంగా కాలమూ .. కథలు కలిసి రాలేదు. దాంతో ఆయనను పరాజయాలు పలకరించడం .. గ్యాప్ రావడం జరిగిపోయింది. ఆయన తాజా చిత్రంగా 'రంగమార్తాండ' రూపొందుతోంది. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి రీమేక్.

కొన్ని కారణాల వలన కొంత కాలంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. "నా అభిమాన నటుడు .. నట రాక్షసుడు ప్రకాశ్ రాజ్ తో ఎమోషనల్ క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నాను" అంటూ కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అనసూయ .. శివాత్మిక కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Prakash Raj
Ramyakrishna
Brahmanandam
Rqangamarthanda
  • Loading...

More Telugu News