Varla Ramaiah: ఎస్ఈసీని కలిసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

Varla Ramaiiah met SEC on voter lists
  • ఓటర్ జాబితాలో లోపాలు ఉన్నాయన్న వర్ల రామయ్య
  • ఒకే కుటుంబసభ్యుల ఓట్లు ఒకే బూత్ లో ఉండాలన్న టీడీపీ నేత
  • వలస వచ్చిన వారి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో లోపాలు సవరించాలని కోరామని వెల్లడించారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్ లో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరామని వివరించారు. వలస వచ్చిన వారి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని వర్ల రామయ్య వెల్లడించారు.
Varla Ramaiah
SEC
Voter Lists
TDP
Andhra Pradesh

More Telugu News