Johannesburg: జోహాన్నెస్ బర్గ్ లో శాంతించని వరుణుడు... ఒక్క బంతి పడకుండానే లంచ్!
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు
- నేడు నాలుగో రోజు ఆట
- జోహాన్నెస్ బర్గ్ లో ఉదయం నుంచి జల్లులు
- విజయానికి 122 పరుగుల దూరంలో సఫారీలు
- 8 వికెట్లు తీస్తే భారత్ దే విజయం
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న జోహాన్నెస్ బర్గ్ లో ఉదయం నుంచి జల్లులు పడుతుండడంతో ఆట ప్రారంభానికి అవాంతరం ఏర్పడింది. జల్లులు ఏమాత్రం తగ్గకపోవడంతో తొలి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు.
ఇక ఈ మ్యాచ్ లో విజయం ఇరుజట్లను ఊరిస్తోంది. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 240 పరుగులు కాగా, ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 2 వికెట్లకు 118 పరుగులు. మరో 122 పరుగులు చేస్తే గెలుపు ఆతిథ్య జట్టు సొంతం అవుతుంది. అయితే, బౌలర్లు చెలరేగి 8 వికెట్లు తీస్తే విజయం టీమిండియాను వరిస్తుంది. ఆటకు రేపు ఆఖరిరోజు.