Tamil Nadu: నిరుద్యోగులను రూ. కోట్లలో మోసం చేసిన కేసు.. తమిళనాడు మాజీ మంత్రిని వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు

Former AIADMK Minister Rajendra Balaji arrested

  • ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయల వసూలు
  • గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేత
  • కర్ణాటకలో తలదాచుకున్నట్టు నిర్ధారణ
  • స్థానిక పోలీసుల సహకారంతో వెంబడించి అరెస్ట్

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత రాజేంద్ర బాలాజీ కర్ణాటకలో అరెస్టయ్యారు.  గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన కర్ణాటకలోని హసన్ లో ఉన్నట్టు తమిళనాడు పోలీసులు పక్కాగా నిర్ధారించుకున్నారు.

అనంతరం స్థానిక పోలీసుల సాయం తీసుకున్నారు. సమాచారశాఖ కార్యాలయం ఎదురుగా నిన్న ఉదయం కారులో వెళ్తున్న రాజేంద్ర బాలాజీని వెంటాడారు. ఓ సిగ్నల్ వద్ద కారు ఆగడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Tamil Nadu
Karnataka
AIADMK
Rajendra Balaji
Arrest
  • Loading...

More Telugu News