Perni Nani: రామ్ గోపాల్ వర్మ గారు.. తప్పకుండా త్వరలో కలుద్దాం: మంత్రి పేర్ని నాని

Perni Nani response to Ram Gopal Varma tweet

  • టికెట్ ధరల తగ్గింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వర్మ
  • అనుమతిస్తే సినిమా సమస్యలపై వివరణ ఇస్తానన్న వర్మ
  • వర్మ సూచనపై సానుకూలంగా స్పందించిన పేర్ని నాని

ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు ఈ నిర్ణయంపై స్పందించారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేస్తున్నారు.

సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ... 'పేర్ని నాని గారు నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంబంధించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కు పేర్ని నాని రిప్లై ఇచ్చారు. 'ధన్యవాదములు వర్మ గారు. తప్పకుండా త్వరలోనే కలుద్దాం' అని సమాధానమిచ్చారు.

పేర్ని నాని నుంచి రిప్లై వచ్చిన వెంటనే వర్మ స్పందించారు. మంత్రి పేర్ని నాని నుంచి సానుకూల స్పందన వచ్చిందని... అందువల్ల ఈ అనవసరమైన వివాదానికి తాను ఇంతటితో ముగింపు పలుకుతున్నానని ట్వీట్ చేశారు.

Perni Nani
YSRCP
Ram Gopal Varma
Tollywood
  • Loading...

More Telugu News