Chandrababu: చేతకాకపోతే తప్పుకోండి.. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తాం: నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు వార్నింగ్

Chandrababu warns constituency incharges

  • ఢీ అంటే ఢీ అనే విధంగా వైసీపీని ఎదుర్కోండి
  • పని చేయడం చేతకాకపోతే దండం పెట్టి తప్పుకోండి
  • ప్రతి ఒక్కరూ నియోజకవర్గాల్లో పని చేయాల్సిందే

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ఇన్ఛార్జీ వారివారి నియోజకవర్గాల్లో పని చేయాల్సిందేనని ఆయన అన్నారు. పని చేయడం చేతకాకపోతే దండం పెట్టి పక్కకు తప్పుకోవాలని చెప్పారు. పని చేయనివారు తప్పుకుంటే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని అన్నారు. పని చేయకుండానే పదవులు వచ్చేయాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటే అది జరిగే పని కాదని చెప్పారు. ఢీ అంటే ఢీ అనే విధంగా వైసీపీ నేతలను ఎదుర్కోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News