Bandi Sanjay: బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట.. బెయిలు మంజూరు

TS High Court gives bail to Bandi Sanjay
  • కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్
  • సంజయ్ ని విడుదల చేయాలని ఆదేశించిన హైకోర్టు
  • రిమాండ్ రిపోర్టును కొట్టేసిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న ఆయనను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్న హైకోర్టు... రిమాండ్ రిపోర్ట్ ను కొట్టేసింది. రూ. 40 వేల వ్యక్తిగత బాండ్ పై బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

హైకోర్టులో బండి సంజయ్ తరపున లాయర్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317ను రద్దు చేయాలని బండి సంజయ్ దీక్ష చేపట్టారని... అయితే పోలీసులు కోవిడ్ నిబంధనల పేరుతో దీక్షను చెదరగొట్టారని కోర్టుకు ఆయన తెలిపారు.
Bandi Sanjay
BJP
TS High Court
Bail

More Telugu News