Andhra Pradesh: రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం

AP govt borrowed Rs 2500 Cr

  • అంతకంతకూ పెరుగుతున్న ఏపీ ప్రభుత్వ అప్పులు
  • రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలంలో రుణాన్ని సమీకరించిన ప్రభుత్వం
  • గత 8 రోజుల్లో రూ. 4,500 కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 2,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం చేసింది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 20 ఏళ్ల కాలపరిమితితో 7.22 శాతం వడ్డీతో రూ. వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 7.18 శాతం వడ్డీతో 18 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంది. మరో రూ. 500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.24 శాతం వడ్డీకి తీసుకుంది. మరోవైపు గత 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం రూ. 4,500 కోట్ల మేర అప్పు చేయడం గమనార్హం.

Andhra Pradesh
Credit
Loans
RBI
  • Loading...

More Telugu News