Chiranjeevi: ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి

chiru on senapati

  • ఆహా ఓటీటీలో విడుద‌లైన సేనాప‌తి
  • యువ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ అద్భుతంగా తీశాడ‌న్న చిరు
  • సినిమా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతుంద‌ని ఆకాంక్ష‌

రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌ అగస్త్య, హర్ష వర్థన్‌, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్ కీల‌క‌ పాత్ర‌ల్లో నటించగా, ఓటీటీలో విడుద‌లైన‌ 'సేనాపతి' సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా సుస్మిత కొణిదెల వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. దర్శ‌కుడు పవన్‌ సాదినేని రూపొందించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం అల్లు అర‌వింద్ కు చెందిన ఓటీటీ ఆహాలో విడుద‌లైంది.

ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ సినిమా చూశాన‌ని, యువ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశాడ‌ని చిరంజీవి కొనియాడారు. సీనియర్ నటుడు, నట‌కిరీటి రాజేంద్రప్ర‌సాద్ ఈ సినిమాలో వినూత్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించార‌ని చెప్పారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  

   

  • Loading...

More Telugu News