Team India: జోహాన్నెస్ బర్గ్ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... 58 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

Team India on leading in Johannesburg test

  • ఆసక్తికరంగా రెండో టెస్టు
  • రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 రన్స్ చేసిన భారత్
  • దూకుడు మీదున్న పుజారా
  • 7 ఫోర్లు బాదిన వైనం
  • పుజారాకు తోడు క్రీజులో రహానే

జోహాన్నెస్ బర్గ్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. తద్వారా 58 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 8 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్ లో అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేసి డువానే ఒలీవియర్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా 35, అజింక్యా రహానే 11 పరుగులతో ఉన్నారు.

గత వైఫల్యాల నేపథ్యంలో పుజారా ఇవాళ్టి ఆటలో దూకుడు ప్రదర్శించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు చేయడానికి 33 బంతులు ఆడిన పుజారా... రెండో ఇన్నింగ్స్ లో 42 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. అందులో 7 బౌండరీలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News