Nagendra Babu: వర్మా... నువ్వు చెప్పింది అక్షరాలా నిజం: నాగబాబు

Nagendrababu supports Ram Gopal Varma

  • కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదం
  • ఏపీ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధిస్తూ రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల
  • ట్విట్టర్ లో స్పందించిన నాగేంద్రబాబు

సినిమా టికెట్ల వివాదం ఇంకా రగులుతూనే ఉంది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించడం తెలిసిందే. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని వర్మ పేర్కొన్నారు. ఒకవేళ సినిమా అనేది నిత్యావసర వస్తువు అని ప్రభుత్వం భావిస్తే, రాయితీలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు వర్మ ఓ వీడియో విడుదల చేశారు.

ఊహించని రీతిలో ఈ వీడియోపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. వర్మకు తన మద్దతు పలికారు. "నువ్వు చెప్పింది అక్షరాలా నిజం... నేను ఏం అడగాలని అనుకున్నానో, ఆ ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు వర్మా!" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, వర్మ విడుదల చేసిన వీడియో తాలూకు ట్వీట్ ను కూడా తన పోస్టులో పొందుపరిచారు.

కాగా, నాగబాబు ట్వీట్ పై వర్మ స్పందించారు. "థాంక్యూ నాగబాబు గారూ... ఈ అంశంపై చిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది స్పందిస్తారని ఆశిస్తున్నాను" అంటూ బదులిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News