Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

High Court denies bail to Bandi Sanjay

  • జాగరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సంజయ్ అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు
  • బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
  • తనకు రోస్టర్ లేదన్న హైకోర్టు

జాగరణ దీక్ష సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనకు  కరీంనగర్ కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నేడు తిరస్కరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ వెల్లడించింది. ఈ పిటిషన్ ను సంబంధిత బెంచ్ కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్ ను జడ్జి ఆదేశించారు.

అటు, బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అయితే నార్త్ జోన్ డీసీపీ దీనిపై స్పందించారు. నడ్డా ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని తెలిపారు.

Bandi Sanjay
Bail
High Court
BJP
JP Nadda
Telangana
  • Loading...

More Telugu News