Pavan Kalyan: 'భీమ్లా నాయక్' నిర్ణయం మారే ఛాన్సే లేదట!

Bheemla Nayak movie update

  • 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్
  • సంక్రాంతికి వచ్చే అవకాశం లేనట్టే  
  • ఫిబ్రవరిలోనే భారీస్థాయి విడుదల
  • సంగీత దర్శకుడిగా తమన్

సంక్రాంతి పండుగకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అందరికంటే ముందుగానే 'భీమ్లా నాయక్' బరిలోకి దిగిపోయాడు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. దాంతో పవన్ అభిమానులంతా తమకి అసలైన సంక్రాంతి ఇదేనని అనుకున్నారు. ఆ రిలీజ్ డేట్ కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తూ కూర్చున్నారు.

అయితే 'ఆర్ ఆర్ ఆర్' జనవరి 7వ తేదీని ఖాయం చేసుకుని రంగంలోకి దిగింది. అది పాన్ ఇండియా సినిమా కావడంతో థియేటర్ల పరిస్థితిని అర్థం చేసుకుని, 'భీమ్లా నాయక్' పక్కకి తప్పుకున్నాడు. ఫిబ్రవరి నెలకి ఈ సినిమాను వాయిదా వేసుకున్నాడు. అయితే ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' ఆలోచన మారడం వలన, 'భీమ్లా నాయక్' మళ్లీ రంగంలోకి దిగనున్నాడనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ఫ్యాన్స్ ఊహించుకుంటున్నట్టుగా ఈ సినిమా సంక్రాంతి బరిలోకి తిరిగొచ్చే ఆలోచన .. అవకాశం లేవని చెబుతున్నారు. ఎందుకంటే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా పూర్తి చేయలేదని అంటున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా పడిందనే ఉద్దేశంతో ఆయన వేరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం వలన, ఈ సినిమా ఇక సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు.

Pavan Kalyan
Rana Daggubati
Nithya Menen
Bheemala Nayak Movie
  • Loading...

More Telugu News