rape bids: బెంగాల్ ఎన్నికల అనంతర హింస కేసు: 21 మందిపై అత్యాచారం జరిగినట్టు ఆధారాల్లేవన్న సీబీఐ

No proof in 21 rape bids mentioned by NHRC

  • పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాడులపై దర్యాప్తు
  • కలకత్తా హైకోర్టుకు నివేదిక
  • 64 లైంగిక దాడులను ప్రస్తావించిన మానవ హక్కుల కమిషన్

పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం (2021 మే నెలలో) జరిగిన దాడుల్లో 64 మంది మహిళలపై అత్యాచారం, అత్యాచారయత్నం జరిగాయంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) పేర్కొనడం తెలిసిందే. అయితే, వీటిలో 21 కేసులకు సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని సీబీఐ తాజాగా స్పష్టం చేసింది.

తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం తర్వాత చోటు చేసుకున్న హత్యలు, లైంగిక దాడులు, వేధింపులపై.. హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ, సిట్ వేర్వేరుగా దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తన దర్యాప్తు నివేదికను కలకత్తా హైకోర్టుకు సీబీఐ సమర్పించింది.

అలాగే 59 హత్యలు జరిగినట్టు హక్కుల కమిషన్ పేర్కొనగా, రాష్ట్ర ప్రభుత్వం 29 హత్యలను ధ్రువీకరించింది. 10 కేసుల్లో సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేయగా.. 38 కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉంది. హక్కుల సంఘాలు బీజేపీ టీమ్ లుగా పనిచేశాయని తృణమూల్ కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. ఈ కేసులో విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

rape bids
cbi
calcutta high court
West Bengal
  • Loading...

More Telugu News