Ramakrishna: పాత పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య... పరారీలో ఎమ్మెల్యే కుమారుడు 

Family commits suicide in Old Palwancha
  • భార్య, కుమార్తెల సహా ఓ వ్యక్తి ఆత్మహత్య
  • ముగ్గురి మృతి.. కాలిన గాయాలతో ఆసుపత్రిపాలైన ఒక చిన్నారి
  • ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు.  రామకృష్ణ, శ్రీలక్ష్మి, వారి కుమార్తె సాహిత్య తమ ఇంట్లోనే అగ్నికి ఆహుతయ్యారు. మరో కుమార్తె సాహితి 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది.

కాగా, రామకృష్ణ కారు నుంచి క్లూస్ టీమ్ కొన్ని కీలక కాగితాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు, ఆపై ఇది ఆత్మహత్యేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. గ్యాస్ లీకేజి ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.

కాగా, ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాఘవేందర్ ఆచూకీ తెలియలేదని, అతడు పరారీలో ఉన్నాడని పాల్వంచ పోలీసులు వెల్లడించారు. కాగా, గతంలో ఓ ఫైనాన్షియర్ ఆత్మహత్యకు కూడా రాఘవేందర్ కారకుడన్న ఆరోపణలు వచ్చాయి.
Ramakrishna
Family
Suicide
MLA Vanama
Raghavender
Palwancha

More Telugu News