Suman: ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు: సినీ నటుడు సుమన్

Suman opines on cinema tickets issue

  • కొంతకాలంగా రగులుతున్న సినిమా టికెట్ల అంశం
  • తిరుపతిలో సుమన్ మీడియా సమావేశం
  • అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకోవాలన్న సుమన్
  • ఇండస్ట్రీలో సీనియర్లున్నారని వ్యాఖ్య 
  • వారి సలహాలు తీసుకోవాలని సూచన

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. చిత్ర పరిశ్రమలో ఐకమత్యం లేదనడం నిజం కాదని స్పష్టం చేశారు.

ఇండస్ట్రీలో కృష్ణంరాజు, మురళీమోహన్, కృష్ణ వంటి సీనియర్లు ఉన్నారని, సమస్యల పరిష్కారానికి సీనియర్ల సలహాలు తీసుకోవాలని సుమన్ సూచించారు. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు.

Suman
Cinea Tickets
Tollywood
Andhra Pradesh
  • Loading...

More Telugu News