Father in law: కోడలిపై కక్ష.. గొంతు కోసి హత్య చేసిన మామ

Father in law murders daughter in law

  • మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన
  • ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సౌందర్య, సాయికృష్ణ
  • పెళ్లయిన రెండు నెలలకే సాయికృష్ణ ఆత్మహత్య

కోడలి గొంతు కోసి మామ దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అదే ఊరికి చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణను 5 నెలల క్రితం పెళ్లి చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.

అయితే, పెళ్లయిన తర్వాత దంపతుల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు నెలలకే సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతితో సౌందర్య తన తల్లి వద్ద ఉంటోంది. తన కొడుకు మృతికి కోడలే కారణమని ఆమెపై మామ తిరుపతి పగ పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి సౌందర్యను తిరుపతి హత్య చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేశాడు. కూతుర్ని రక్షించడం కోసం అడ్డుపడిన ఆమె తండ్రి లక్ష్మయ్యకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Father in law
daughter in law
murder
  • Loading...

More Telugu News