Saana Kastam: చిరంజీవి 'ఆచార్య' నుంచి 'శానా కష్టం' లిరికల్ వీడియో రిలీజ్

Saana Kastam lyrical song from Acharya out now

  • చిరంజీవి హీరోగా 'ఆచార్య'
  • కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం
  • చిరు సరసన ఐటమ్ సాంగ్ లో రెజీనా
  • మణిశర్మ బాణీలకు భాస్కరభట్ల సాహిత్యం

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' చిత్రం నుంచి 'శానా కష్టం' అనే మాస్ మసాలా సాంగ్ విడుదలైంది. 'శానా కష్టం' లిరికల్ సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది. ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన అందాలభామ రెజీనా కసాండ్రా నటించింది. మణిశర్మ సంగీతం అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Saana Kastam
Lyrical Song
Acharya
Chiranjeevi
Koratala Siva
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News