Jaggareddy: తాను కేటీఆర్ కోవర్ట్ నంటూ జరుగుతున్న ప్రచారంపై జగ్గారెడ్డి స్పందన

Jaggareddy clarifies on his pep talk with KTR

  • ఇటీవల కేటీఆర్ తో ముచ్చటించిన జగ్గారెడ్డి
  • రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
  • టీఆర్ఎస్ ఏజెంట్ నంటూ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం
  • వెళ్లాలనుకుంటే నేరుగానే టీఆర్ఎస్ లోకి వెళ్లగలనని వ్యాఖ్య  

ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ తో ముచ్చటించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను కేటీఆర్ కోవర్టునంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కేటీఆర్ ను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు పలకరించడం, మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్ తోనూ ఆ విధంగానే మాట్లాడానని అన్నారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేసినా, తాను ఆయన భుజంపై చేయి వేయలేదని వివరణ ఇచ్చారు.

అయితే, తాను టీఆర్ఎస్ ఏజెంట్ నంటూ ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెళ్లాలనుకుంటే నేరుగా టీఆర్ఎస్ లోకి వెళ్లగలనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ తయారైందని ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నది ఎవరు? నేనా... ఓ వ్యక్తి అభిమాని సంఘాలా? అని ప్రశ్నించారు. పీసీసీ పదవి అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News