Chiranjeevi: పెద్ద‌గా ఉండ‌ను కానీ బాధ్య‌తగ‌ల బిడ్డ‌గా ఉంటా: చిరంజీవి

chiranjeevi on tollywood

  • పెద్ద‌రికం అనే హోదా నాకు స‌సేమిరా ఇష్టం లేదు
  • అవ‌స‌రం ఉన్న‌ప్పుడు నా భుజం కాయాల‌నుకున్న‌ప్పుడు వ‌స్తాను
  • ప‌రిశ్ర‌మ స‌మ‌గ్ర అవ‌స‌రాల కోస‌మైతేనే ముందుకు వ‌స్తాను
  • ఇద్ద‌రు కొట్టుకుంటుంటే త‌గువు తీర్చ‌మంటే తన వల్ల కాదన్న మెగాస్టార్  

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ గురించి, చెల‌రేగుతోన్న వివాదాల గురించి చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఈ రోజు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. పెద్ద‌రికం అనే హోదా త‌నకు స‌సేమిరా ఇష్టం లేదని చెప్పారు. పెద్ద‌గా ఉండ‌ను కానీ బాధ్య‌తగ‌ల బిడ్డ‌గా ఉంటానని వ్యాఖ్యానించారు.

అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు నేను ఉన్నానంటూ ముందుకు వ‌స్తానని చెప్పారు. అన‌వ‌స‌ర‌మైన వాటికి త‌గుదున‌మ్మా అంటూ ముందు కొచ్చే ప్ర‌స‌క్తే లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు నా భుజం కాయాల‌నుకున్న‌ప్పుడు వ‌స్తానని హామీ ఇచ్చారు. ఇద్ద‌రు కొట్టుకుంటుంటే త‌గువు తీర్చ‌మంటే నేను తీర్చ‌నని ఆయ‌న కరాఖండీగా పేర్కొన్నారు.

ప‌రిశ్ర‌మ స‌మ‌గ్ర అవ‌స‌రాల కోస‌మైతేనే ముందుకు వ‌స్తానని ఆయ‌న స్పష్టం చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద అనిపించుకోవ‌డం తనకు ఇబ్బందని వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరని, ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాలని సినీ కార్మికులు కోర‌గా చిరంజీవి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

  • Loading...

More Telugu News