Covid cases: అమెరికాలో భారీగా ఒమిక్రాన్ కేసులు.. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారులు, యువకులు

Surge in Covid cases hospitalisations among kids young adults in US as Omicron spreads

  • 5-11 వయసులోని చిన్నారులకు ఆసుపత్రి చికిత్స
  • ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న యువత
  • 70 శాతం కేసులు 18-49 మధ్య వయసు నుంచే
  • టీకాలను పూర్తి స్థాయిలో తీసుకోకపోవడం కారణమే

అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుంటే, మరోపక్క వైరస్ కారణంగా యుక్త వయసులోని వారు, చిన్నారులు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. డిసెంబర్ 22-28 మధ్య లాస్ ఏంజెలెస్ కౌంటీలో నమోదైన కరోనా కేసుల్లో 70 శాతానికి పైగా 18-49 వయసు నుంచే ఉన్నాయి. నెల క్రితంతో పోలిస్తే 18-29 వయసులోని వారు ఇన్ఫెక్షన్ బారిన పడడం ఎనిమిది రెట్లు పెరిగింది. 30-49 మధ్య వయసున్న వారు నెల క్రితంతో పోలిస్తే ఆరు రెట్లు అధికంగా కరోనా బారినపడుతున్నారు.

క్యాలిఫోర్నియాలో ఆరెంజ్ కౌంటీలో 5-11 మధ్య వయసులోని చిన్నారుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. సౌత్ నెవెడాలో టీనేజీ, యుక్త వయసు వారు కరోనా బారిన పడడం గణనీయంగా పెరిగింది. ప్రతి లక్ష మందికి గాను 45 కేసులు 18-24 వయసు గ్రూపు నుంచే ఉంటున్నాయి. మొత్తానికి కరోనా కారణంగా 19 శాతం మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.

ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సగటు రేటు 58 శాతం పెరిగింది. చికాగోలోని చిన్న పిల్లల ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత భారీ సంఖ్యలో కేసులను చూస్తున్నట్టు అడ్వొకేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైస్ చైర్మన్ మైఖేల్ క్యాపెల్లో తెలిపారు. ఈ వయసులోని వారు పూర్తి స్థాయిలో టీకాలను తీసుకోకపోవడమే కారణమై ఉండొచ్చన్నారు. ఈ వారంలోనే అమెరికాలో కేసుల సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News